Home > తెలంగాణ > పార్టీ మార్పుపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పార్టీ మార్పుపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పార్టీ మార్పుపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు హింట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని మునుగోడు ప్రజలు తనపై ఒత్తిడి తెస్తున్నారని రాజగోపాల్ చెప్పారు. ఉపఎన్నిక సమయానికి ఇప్పటికి పరిస్థితులు మారాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తాను అనుకుంటున్నానన్న ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే భవిష్యత్ నిర్ణయం ఉందని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని రాజగోపాల్ స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ పెద్దలతో చర్చించిన ఆయన.. ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

గతంలో మనుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ నుంచి మునుగోడు బైపోల్‌ ఎన్నికలో పోటీ చేసి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. బై పోల్ అనంతరం బీజేపీలో అంతగా యాక్టివ్ గా లేని రాజగోపాల్.. కొంతకాలంగా పార్టీ జాతీయ, రాష్ట్రనాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తిరిగి సొంతగూటికి వెళ్లనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.


Updated : 23 Oct 2023 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top