Home > తెలంగాణ > కొందరికి మా మాటలు తూటల్లా తగులుతున్నాయి - Rajgopal Reddy

కొందరికి మా మాటలు తూటల్లా తగులుతున్నాయి - Rajgopal Reddy

కొందరికి మా మాటలు తూటల్లా తగులుతున్నాయి - Rajgopal Reddy
X

కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందాల కోసం పనిచేయదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజల్ని మభ్యపెట్టి భ్రమలు కల్పించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రాజగోపాల్ డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై రాజగోపాల్ సటైర్లు వేశారు. గ్యారేజ్కు పోయిన కారుకు డ్రైవర్ కూడా లేకుండా పోయాడని అన్నారు. కేసీఆర్ ప్రజల తీర్పును సైతం గౌరవించరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యమనే పదాన్ని మర్చిపోయిందని.. ప్రతిపక్ష నేతగా సభకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్పై లేదా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిద్దిద్దే ప్రయత్నంలో ఉన్నామన్న రాజగోపాల్.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కొందరికి తమ మాటలు తూటాల్లా తగులుతున్నాయన్న రాజగోపాల్ వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. పదేండ్లలో నల్గొండకు జరిగిన అన్యాయంపై ఇంత చర్చ జరుగుతున్నా.. జగదీశ్ రెడ్డి సభకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. నల్గొండ సభకు జనసమీకరణలో బీజీగా ఉన్నారని చెబుతున్నారని, కానీ పైసలిస్తామన్నా జనం సభకు వచ్చేదిలేదని తెగేసి చెబుతున్నారని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు మాటలు తగ్గించుకుంటే మంచిదని ఇలాగే మాట్లాడితే ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతదని రాజగోపాల్ సూచించారు.

Updated : 12 Feb 2024 10:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top