Home > తెలంగాణ > స్క్రీనింగ్ కమిటీ మీటింగ్కు వెంకట్ రెడ్డి డుమ్మా.. రంగంలోకి ఏఐసీసీసీ

స్క్రీనింగ్ కమిటీ మీటింగ్కు వెంకట్ రెడ్డి డుమ్మా.. రంగంలోకి ఏఐసీసీసీ

స్క్రీనింగ్ కమిటీ మీటింగ్కు వెంకట్ రెడ్డి డుమ్మా.. రంగంలోకి ఏఐసీసీసీ
X

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇవాళ జరిగిన స్క్రీనింగ్ కమిటీ భేటీకి సైతం డుమ్మా కొట్టారు. ఇంతకాలం పార్టీనే తొలి ప్రాధాన్యమన్న ఆయన.. ఇప్పుడు ఆత్మగౌరవమే ముఖ్యమని చెప్పడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఎలాంటి కీలక పదవులు దక్కకపోవడమే వెంకట్ రెడ్డి అలకకు కారణమని తెలుస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్లు సమాచారం. అంతర్గత సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అనంతరం కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్నా అని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి స్ట్రాంగ్ లీడర్ అని ఆయన అలగరని సీనియర్ నేత భట్టి విక్రమార్క అంటున్నారు.

పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వెంకట్ రెడ్డి.. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం కలిసికట్టుగా పనిచేయాలన్న హైకమాండ్ ఆదేశాల మేరకు మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే తాజాగా పార్టీలో చేరికలు, టికెట్ల కేటాయింపు అంశం కోమటిరెడ్డిని మళ్లీ అసహనానికి గురిచేశాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ లిస్టులో ఆయన పేరు లేకపోవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన స్క్రీనింగ్ కమిటీ మీటింగ్కు డుమ్మా కొట్టినట్లు సమాచారం.

Updated : 6 Sep 2023 10:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top