Home > తెలంగాణ > బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పార్టీ పరిస్థితి ప్రతిపక్షంలా కాకుండా ఫ్రస్టేషన్ పక్షంలా మారిందని సటైర్ వేశారు. అబద్దాల పార్టీ అయినందుకే బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని వెంకట్ రెడ్డి చురకలంటించారు. నల్లగొండ ప్రజలు వారిని చీదరించుకుంటున్నారని, ఆ పార్టీ వాళ్లను దేవుడు కూడా కాపాడలేడని అన్నారు.

2001లో దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పిండని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. దళితుడు ప్రతిపక్ష నాయకుడైతే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చిన చరిత్ర కేసీఆర్దని మండిపడ్డారు. నల్లగొండలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ సభ పెట్టారన్న వెంకట్ రెడ్డి.. బీఆర్ఎస్ ర్యాలీలో ఓ హోం గార్డు చనిపోయినా పట్టించుకోలేదని వాపోయారు.




Updated : 15 Feb 2024 11:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top