Home > తెలంగాణ > టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తాం - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తాం - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తాం - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో టీచర్స్ రిక్రూట్ మెంట్ అభ్యర్థులను ఆయన కలిశారు. టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని వారు ఎంపీకి వివరించారు. అనంతరం మాట్లాడిన వెంకట్ రెడ్డి ఓట్ల కోసం పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న కేసీఆర్ కు నిరుద్యోగుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. టీఆర్టీ అభ్యర్థులకు అండగా ఉంటామని చెప్పారు.





టీఆర్‌టీ కోసం నిరసన కార్యక్రమాలు చేపడదామని వెంకట్ రెడ్డి అన్నారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోతే ప్రగతి భవన్ ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాన‌న్న ఆయన.. టీఆర్‌టీ కోసం అభ్యర్థులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ బ‌డుల్లో వేలాది టీచ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం మాత్రం వీటిని భ‌ర్తీ చేయ‌డం లేదని మండిపడ్డారు. టీఆర్‌టీ అంశాన్ని పీఏసీ స‌మావేశంలోనూ చ‌ర్చిస్తామని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. టీఆర్‌టీ నోటిఫికేషన్‌ కోసం ఇందిరాపార్క్‌ వద్ద 48 గంట‌ల దీక్ష చేసి నిరుద్యోగుల‌కు అండ‌గా ఉంటామని భరోసా ఇచ్చారు.

4 నెలల్లో కేసీఆర్ సర్కారు నోటిఫికేషన్‌ ఇవ్వకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్‌ వచ్చేలా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ఒకవేళ తాను మాట తప్పితే తెలంగాణ కోసం చేసిన‌ట్టు నిరుద్యోగుల కోసం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

komatireddy venkat reddy slams cm kcr for not releasing TRT notification

telangana,hyderabad,komatireddy venkat reddy,trt notification,congress,teacher recruitment test,pragathi bhavan,cm kcr,teacher posts,indira park,resign

Updated : 23 July 2023 10:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top