Komatireddy Venkat Reddy : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి
X
నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 5వ అంతస్తులో ఉన్న తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కోమటిరెడ్డికి గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
కోమటిరెడ్డి 1999, 2004, 2009, 2014లలో నల్గొండ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2018లో మళ్లీ నల్గొండ నుంచే పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.