షర్మిల ముఖంలో సంతోషం.. విలీనానికి ముహూర్తం ఫిక్స్..!
X
వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ముహూర్తానికి వేళయిందా..? షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా..? ఈ మేరకు రెండు పార్టీల మధ్య విలీనంపై చర్చ కుదరిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముగింపు దొరికినట్లు తెలుస్తోంది. శుక్రవారం (ఆగస్టు 11) ఢిల్లీ పర్యటనను ముగించుకున్న షర్మిల.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డితో కలిసి విమానాశ్రయంలో కనిపించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో షర్మిల విలీనంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కోమటిరెడ్డి.. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు.
తెలంగాణలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న షర్మిత తమ పార్టీలోకి వస్తే లాభమని అన్నారు. షర్మిల లాంటి నాయకురాలు తమతో కలిసి పనిచేయడం అవసరమని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తప్పులేనప్పుడు.. షర్మిల తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తప్పేమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. షర్మిల వల్ల 4 ఓట్లొచ్చినా 400 ఓట్లు వచ్చినా తమకు లాభమేనని అన్నారు. పార్టీలో ఎవరు చేరినా అందర్నీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తమదని తెలిపారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడటానికి షర్మిల నిరాకరించారు. ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ ఉండిపోయారు. తన ముఖంలో సంతోషం చేస్తుంటే.. సమావేశంలో గట్టి ఒప్పందాలు జరిగాయని, తప్పకుండా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు చెప్తున్నారు.