Home > తెలంగాణ > మోదీ అప్పు ఇవ్వకపోతే.. తెలంగాణ చీకట్లోకి వెళ్లేది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోదీ అప్పు ఇవ్వకపోతే.. తెలంగాణ చీకట్లోకి వెళ్లేది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోదీ అప్పు ఇవ్వకపోతే.. తెలంగాణ చీకట్లోకి వెళ్లేది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప పెట్టిపోయిందని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగుతుందంటే దానికి కారణం మోదీ అని అన్నారు. రాష్ట్రాలకు ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించిపోయినా.. కొత్తగా అప్పు తీసుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి ఓటు వేసి మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 65 శాతం మంది ముస్లింలు మోదీ పథకాలతో లబ్ధి పొందుతున్నారని, అందుకే బీజేపీకే ఓటు వేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి మోదీ వల్లే సాధ్యపడిందన్నారు. రూ.9 వేల కోట్ల అప్పు ఇవ్వకపోతే తెలంగాణ చీకట్లోకి వెళ్లేదని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో మరిన్ని ఓట్లు వేసి బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రచ్చ చేస్తున్నాయని, ఇన్ని రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.


Updated : 1 March 2024 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top