Home > తెలంగాణ > పొత్తు పెట్టిన చిచ్చు..బీఆర్ఎస్కు కోనేరు కోనప్ప రాజీనామా

పొత్తు పెట్టిన చిచ్చు..బీఆర్ఎస్కు కోనేరు కోనప్ప రాజీనామా

పొత్తు పెట్టిన చిచ్చు..బీఆర్ఎస్కు కోనేరు కోనప్ప రాజీనామా
X

లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప ..ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కోనప్ప తన అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. తమను ఓడించిన వారితో ఏలా పని చేస్తామని కోనప్ప అన్నారు. పొత్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోనప్ప బాటలోనే మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది.

Updated : 6 March 2024 10:06 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top