Home > తెలంగాణ > Upasana: తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన ఉపాసన

Upasana: తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన ఉపాసన

Upasana: తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన ఉపాసన
X

తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ విషయాన్నీ ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. "గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారిని కలిశాను. గిరిజన సంక్షేమం కోసం ఆమె చేస్తున్న పనుల గురించి లోతైన అవగాహన పొందడం నిజంగా నా హృదయాన్ని కదిలించాయి. మేడమ్, మీ అద్భుతమైన పనికి మీకు వందనాలు” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మెగా కోడలు ఉపాసన కొణిదెల... ఒకపక్క మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకొంటూనే ఇంకోపక్క అపోలో బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక గత ఏడాది క్లింకార రాకతో తల్లిగా కొత్త బాధ్యతలు తీసుకున్నారు. అయినా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. అపోలో ఆస్పత్రిలో వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బి పాజిటివ్‌ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ ఆరోగ్య బీమాకు సంబంధించిన టీపీఏ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ ఉన్నారు. వ్యాపారాన్ని సమర్థవంతంగా చూసుకునే ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటారు. మహిళలకు మేలు చేసే ఎన్నో మంచి పనులను ఉపాసన తన అపోలో హాస్పిటల్స్ లో చేపట్టారు.

Updated : 1 Feb 2024 9:03 PM IST
Tags:    
Next Story
Share it
Top