హైదరాబాదీలకు అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
X
హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ప్రకటించింది. జనవరి 3న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పింది. ఈ మేరకు జలమండలి మంగళవారం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా తాగునీటి వాటర్ సప్లై స్కీం ఫేజు – 1 మరమ్మత్తు పనుల కారణంగా 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై ఉండదని చెప్పింది. ప్రాజెక్ట్ లో భాగంగా సంతోష్ నగర్ వద్ద ఉన్న పైప్ లైన్ జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 3 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 2 (గురువారం) ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు జలమండలి స్పష్టం చేసింది.
ఈ పైప్ లైన్ పనుల వల్ల.. పాతబస్తీలోని మీర్ఆలం, కిషన్‌బాగ్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, మాదన్నపేట్, రియాసత్ నగర్, అలియాబాద్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పాడనుంది. ఇవే కాకుండా కొన్ని సమీప ప్రాంతాల్లోనూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చునని జలమండలి పేర్కొంది.