Home > తెలంగాణ > పోలీస్ స్టేషన్‌కు చేరిన బావమరదళ్ల పంచాయితీ

పోలీస్ స్టేషన్‌కు చేరిన బావమరదళ్ల పంచాయితీ

పోలీస్ స్టేషన్‌కు చేరిన బావమరదళ్ల పంచాయితీ
X

మాజీ మంత్రి నారాయణ, ఆయన మరదలు పొంగూరు కృష్ణ ప్రియల మధ్య నెలకొన్న వివాదం చివరికి పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. తన బావ నారాయణ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ వీడియో విడుదల చేసిన ఆయన తమ్ముడి భార్య పొంగూరి ప్రియ.. ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. నారాయణపై ఇవాళ ఉదయం రాయదుర్గం పీఎస్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బావ మాజీమంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తున్నారని.. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.





ఈ మేరకు రాయదుర్గం పీఎస్‌లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది. అలాగే తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానంటూ తన భర్త సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను నవ్వుతూ ఆరోపణలు చేయడాన్ని కొంతమంది విమర్శలు చేస్తున్నారని అయితే ఇకపై ఏడుస్తూ వీడియోలు చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు..ఎందుకు కేసు పెట్టలేదు అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారని అందుకే ఇప్పుడు తన బావ మాజీమంత్రి పొంగూరు నారాయణ, భర్త సుబ్రహ్మణ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వీడియోలో వెల్లడించారు. ఆమె పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.





అయితే ఆమె ఫిర్యాదు చేయలేదని కొందరు అంటున్నారు. ఆదివారం ఉదయం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు ప్రియా చేరుకున్న సంగతి నిజమేనని.. అయితే ఫిర్యాదు ఇవ్వకముందే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు కొందరు అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె ఫిర్యాదు చేసిందని కొందరు అంటుంటే.. తమకేం తెలియదని మరికొంతమంది పోలీసులు చెబుతున్నారు.




Updated : 30 July 2023 3:13 PM IST
Tags:    
Next Story
Share it
Top