Home > తెలంగాణ > హైదరాబాద్‎కు భారీ వర్ష సూచన..అలర్ట్‎గా ఉండాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‎కు భారీ వర్ష సూచన..అలర్ట్‎గా ఉండాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‎కు భారీ వర్ష సూచన..అలర్ట్‎గా ఉండాలి : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న మూడు రోజులు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం మీదుగా వీస్తున్నాయని తెలిపింది. భారీ వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్‎ను జారీ చేశారు. హైదరాబాద్‎లోనూ ఈ వీకెండ్‎లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా పనిచేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్య ఇవ్వాలన్నారు.


వార్డు కార్యాలయాల వ్యవస్థ పనితీరుపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అధికారులు చెప్పడంతో వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వార్డుల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారం ద్వారా ఈ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు మంత్రి సలహా ఇచ్చారు.





Updated : 5 July 2023 8:44 PM IST
Tags:    
Next Story
Share it
Top