కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
X
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హెటెన్ష్ వాతావరణం నెలకొంది, ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిసిన తర్వాత మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కవిత ఇంటికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు కీలక నేతలు పార్టీని వీడుతుండగా కవిత అరెస్ట్ కావడం గులాబీ నేతల్లో కలవరం మొదలైంది. అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో ఆమె నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ కవిత ఇంట్లో సోదాలు చేయడం, అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.కాసేపట్లో కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.