కొడుకు ఫొటోలు షేర్ చేసిన కేటీఆర్.. నమ్మలేకపోతున్నా అంటూ..
X
కేటీఆర్.. మంత్రి మాత్రమే కాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా.. నెక్ట్స్ సీఎం ఆయనే అంటారు ఆ పార్టీ నేతలు.. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే కేటీఆర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అదీ తన కొడుకు విషయంలో.. కొడుకు హిమాన్షు చిన్నప్పటి ఫొటోలు షేర్ చేస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
కేటీఆర్ తనయుడు హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నాడు. దీంతో కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. బాల్యం నుంచి ఇప్పటివరకు ఉన్న తనయుడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేవరకు ప్రతి తండ్రి ఇలాగే ఫొటోలు తీస్తుంటాడు అని చెప్పారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
‘‘నిన్న మొన్నటిదాకా అల్లరి పిల్లాడుగా ఉన్న హిమాన్షు ఇప్పుడు పెద్దవాడై కాలేజీకి వెళుతున్నాడంటే నమ్మలేకపోతున్నా. హిమాన్షు ఎదిగే కొద్దీ నాలో ఒక భాగంలా మారిపోతున్నాడు. తనతోపాటు నాలోని కొంత భాగాన్ని తీసుకెళ్తున్నాడు. నాన్న డ్యూటీలో భాగంగా నేను కూడా ఫ్యామిలీతో పాటు వారం రోజులు అమెరికా వెళ్తున్నా. అలాగే కొన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి కొన్ని ఫొటోలను జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.