Home > తెలంగాణ > Razakar movie 2023: రజాకార్ సినిమా టీజర్పై స్పందించిన కేటీఆర్.. వారి పనే అంటూ..

Razakar movie 2023: రజాకార్ సినిమా టీజర్పై స్పందించిన కేటీఆర్.. వారి పనే అంటూ..

Razakar movie 2023: రజాకార్ సినిమా టీజర్పై స్పందించిన కేటీఆర్.. వారి పనే అంటూ..
X

తెలంగాణలో రజాకార్ మూవీ వివాదాలకు కేంద్రంగా మారుతుంది. నిజాం ప్రభుత్వం అరాచకాలపై తీసిన ఈ మూవీపై ముస్లింలు భగ్గుమంటున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ ముస్లింలను విలన్లుగా చూపిస్తూ ఈ సినిమా తీశారని ఎంఐఎం సహా పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజాకార్ మూవీలోని సన్నివేశాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అందువల్ల ఈ సినిమా రిలీజ్ను ఆపాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి మంత్రి కేటీఆర్, డీజీపీ, హరీష్ రావును ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్కు మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. రాజకీయ ప్రచారం కోసం బీజేపీకి చెందిన కొంతమంది దివాళా తీసిన జోకర్లు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం’’ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాకు యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించారు.

Updated : 18 Sept 2023 3:53 PM IST
Tags:    
Next Story
Share it
Top