తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి కేటీఆర్ కామెంట్స్
X
తెలంగాణ సోయి లేనోడు ముఖ్యమంత్రి అవడం మన ఖర్మ అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు. తెలంగాణపై గౌరవం అంత కన్నా లేదు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంగా ప్రధాని మోదీ సాక్షిగా దాడి చేశాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ అని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలవనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నాడని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గోల్ మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా..మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..? అని నిలదీశారు. నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.. ఇదేం రీతి.. రేవంత్ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన?నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.