KTR : మాణిక్కం ఠాగూర్ నోటీసులపై కేటీఆర్ కౌంటర్
X
తెంగాణ వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్‌పై చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తనపైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాకూర్ అయోమయంలో ఉన్నారన్నారు. ఠాకూర్ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీకు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాటని కేటీఆర్ గుర్తు చేశానన్నారు. కోమటిరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదన్నారు. కోమటిరెడ్డి తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యలపైన వివరణ కూడా ఇవ్వలేదన్నారు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని కేటీఆర్, ఠాకూర్‌ని సూచించారు.
తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి కార్యాలయానికి పంపించండని సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కమ్ ఠాగూర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు పెట్టి సీఎం పోస్ట్ కొన్నారని కేటీఆర్ కామెంట్ చేయడంపై ఈ నోటీసులు పంపారు. రేవంత్.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయ్యాడనీ, అందుకోసం కోసం మానిక్కం ఠాగూర్‌కి 50 కోట్లు ఇచ్చినట్టు ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. అయితే కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీస్ పంపారు మానిక్కం ఠాగూర్. ఆ నోటీసులు ఎక్స్‌లో చేశారు.