Home > తెలంగాణ > KTR :కాంగ్రెస్ అస‌మ‌ర్థత వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు : కేటీఆర్

KTR :కాంగ్రెస్ అస‌మ‌ర్థత వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు : కేటీఆర్

KTR :కాంగ్రెస్ అస‌మ‌ర్థత వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు : కేటీఆర్
X

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరి విమర్శలతో నాయకులు పొలిటికల్ హీట్ను పెంచుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అస‌మ‌ర్థత వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు ఏర్ప‌డ్డాయ‌ని అన్నారు. తెలంగాణ రైతుల‌కు కాంగ్రెస్ పార్టీ అస‌మ‌ర్థ‌త గురించి తెలుస‌ని.. దశాబ్దాలుగా ఆ బాధలు ఎదుర్కొన్నారని అన్నారు. ఇప్పుడు కర్నాటక రైతులు కూడా ఆ బాధ‌లు అనుభ‌విస్తున్నార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరోవైపు కర్నాటకలో ఏడుగంటల కరెంట్ సరాఫరా చేయాలంటూ రైతులు ధర్నాలు చేస్తున్నారు. 5 గంటల కరెంట్ కూడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ క్రమంలో ఓ రైతు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మొసలితో నిరసనకు దిగాడు. విజయపూర్ జిల్లా రోణిహాల్ గ్రామంలో కరెంట్ ఇవ్వకపోతే సబ్ స్టేషన్ ఆఫీసులోకి మొసలిని వదులుతానని ఓ రైతు ఆందోళనకు దిగాడు.

Updated : 21 Oct 2023 1:55 PM IST
Tags:    
Next Story
Share it
Top