కేటీఆర్.. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు: రేవంత్ రెడ్డి
X
మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండి పడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వ్యవసాయం అంటే అమెరికా వెళ్లి అంట్లు తోమటం కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రైతులకు ఉచిత కరెంట్ అంశం హాట్ టాపిగ్ గా మారడంతో.. రేవంత్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. దీనికి కౌంటర్ ఇచ్చిన రేవంత్.. కేటీఆర్ కు సవాల్ విసురుతూ తనతో చర్చకు రావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు అంటూ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ‘ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో రెస్ట్ తీసుకోవడం, సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ. ఎడ్లు - వడ్లు అని ప్రాసకోసం పాకులాడే ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడపడం, రైతులతో కలిసి నాట్లు వేసిన పోస్ట్ లు పెట్టి కౌంటర్ ఇచ్చారు.