KTR: రేవంత్ రెడ్డి కాదు.. రేటెంత రెడ్డిగా పిలవాలి: కేటీఆర్
X
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషర్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మహా సంగ్రామానికి అన్ని పార్టీలు సన్నదం అవుతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడటం.. బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ నేతుల, కార్యకర్తలకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన కేటీఆర్.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
‘సభకు వస్తుంటే ఓ పెద్దావిడ నాకు బొట్టు పెట్టి.. మీ బాపుకు ఆరోగ్యం బాగోలేదంట కదా.. ఇప్పుడెలా ఉందని అడిగింది. కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నారు. మనకోసం ఇంటి నుంచే పనులు చేస్తున్నడు. తొందర్లోనే పులి బయటికొచ్చి అన్ని ప్రకటనలు చేస్తారు. నువ్వేం బాధపడకని ఆ పెద్దావిడతో చెప్పివచ్చా. ఆయన రాకతో ఎగిరెగిరి పడుతున్న గుంటనక్కలు, తోడేళ్లన్నీ పారిపోతాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి తొర్రలకు పోయి దాక్కుంటార’ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 03న కౌంటింగ్ జరుగుతాయి. ఇదంతా శుభపరిణామమే. తెలంగాణ సీఎంగా 3వ సారి కేసీఆర్ గద్దెనెక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని, రైతు బంధుకు రామ్ రామ్.. దళిత బంధుకు జై భీమ్ చెప్తారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని, ఆయన తన పేరును రేటెంత రెడ్డిగా మార్చుకోవాలని విమర్శించారు.