Home > తెలంగాణ > KTR: 'మీరు బయటకుపోతే తెలుస్తది .. అమ్మ విలువ..': మంత్రి కేటీఆర్

KTR: 'మీరు బయటకుపోతే తెలుస్తది .. అమ్మ విలువ..': మంత్రి కేటీఆర్

KTR: మీరు బయటకుపోతే తెలుస్తది .. అమ్మ విలువ..: మంత్రి కేటీఆర్
X

ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు నాణ్య‌మైన పోషాకాహారం అందివ్వాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాడు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ ప‌థ‌కాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. అల్పాహారం రుచి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి విద్యార్థుల చదువు, తల్లిదండ్రులు, బాగోగుల గురించి మంచి చెడులు అడిగారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి.. అమ్మ ఇంట్లోనే ఉంటుంది.. ఏం చేయదు అన్న మాటకు .. అమ్మ విలువ ఏంటో తెలియజేశారు కేటీఆర్.

విద్యార్థులతో కలసి మంత్రి కేటీఆర్ అల్పాహారం చేస్తున్న సమయంలో.. అక్కడి కొందరు విద్యార్థులు వచ్చారు. అందులో ఒకరిని అమ్మానాన్నలు ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఏం చేయదు, ఇంట్లోనే ఉంటుంది అన్ని సమాధానమిచ్చాడు. ఇందుకు కేటీఆర్ కూసింత కోపంగానే.. "అట్ల అనకురా.. ఇంట్లో నిన్ను, మీ నాన్నను చూసుకునేది అమ్మేనని.. హోమ్ మేకర్ అని, ఏం చేయదు అని అనకూడదని" సున్నితంగా మందలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారంతా.. అమ్మ గురించి ఎంత బాగా చేపిన్నావ్ అన్న అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 23 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు ప్ర‌తి రోజు ఉద‌యం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం కింద అల్పాహారం అందిస్తున్నామ‌ని అక్కడ చేసిన ప్రసంగంలో తెలిపారు కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 27,147 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌ధ్యాహ్నం భోజ‌నంలో భాగంగా ప్ర‌తి విద్యార్థికి సన్న‌బియ్యంతో కూడిన భోజ‌నాన్ని అందిస్తున్నామ‌ని మంత్రి గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో, మున్సిపాలిటీల్లో మున్సిప‌ల్ శాఖ ఆధ్వ‌ర్యంలో, గ్రామాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా క‌లిసి బ్రేక్ ఫాస్ట్‌ను అందించ‌నున్నాయని తెలిపారు. మెనూ ప్ర‌కారం అల్పాహారం అందివ్వ‌క‌పోతే త‌మ‌కు ఫోన్ చేయాల‌ని విద్యార్థుల‌కు కేటీఆర్ సూచించారు.

Updated : 6 Oct 2023 2:24 PM IST
Tags:    
Next Story
Share it
Top