KTR : కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం
Mic Tv Desk | 3 Jan 2024 2:31 PM IST
X
X
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేసే అవకాశం వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 18న హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ ఇండియా కాన్ఫరెన్స్ లో మాట్లాడేందుకు బిజినెస్ స్కూల్ విద్యార్థులు కేటీఆర్ కు ఆహ్వానం పంపారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, విద్యా వేత్తలు, వ్యాపార ప్రముఖులు, విధాన నిర్ణేతలు, ప్రవాస భారతీయులు తదితరులు పాల్గొంటారు.
ఇక ఈ కాన్ఫరెన్స్ లో ఆర్థిక పరమైన పలు విషయాలను కేటీఆర్ విద్యార్థులకు చెప్పనున్నారు. ఇక హార్వర్డ్ ఈ ఆహ్వానం మేరకు ఈ నెల 17నే కేటీఆర్ అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. కాగా కేటీఆర్ గతంలోనూ పలు యూనివర్సిటీల్లోకి వెళ్లి అక్కడి విద్యార్థులతో పలు విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు.
Updated : 3 Jan 2024 3:03 PM IST
Tags: Former minister BRS working president KTR Harvard University America students business school academicians business leaders policy makers diaspora
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire