Home > తెలంగాణ > KTR: కేసీఆర్‌ హయాంలో కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధి.. మంత్రి కేటీఆర్

KTR: కేసీఆర్‌ హయాంలో కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధి.. మంత్రి కేటీఆర్

KTR: కేసీఆర్‌ హయాంలో కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధి.. మంత్రి కేటీఆర్
X

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హ‌బ్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో, ఉద్యోగాలు పొందిన యువ‌త‌తో మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి ముచ్చ‌టించారు. రూ.90 కోట్లతో నల్గొండ- హైదరాబాద్​ రహదారి పక్కనే ఈ ఐటీ హబ్​ని నిర్మించారు. ఇది పూర్తిగా గ్రీన్​ బిల్డింగ్​ తరహాలో.. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇందులో 3600 మంది ఉద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఐటీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఐటీ రంగంలో బెంగళూరు తరువాత తెలంగాణలోనే అధిక ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

అంతకుముందు సూర్యాపేటలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనాలను ప్రారంభించారు కేటీఆర్, మహిళా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. లబ్ధిదారులకు దళితబంధు చెక్కులు పంపిణీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పంపిణీ, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక సూర్యాపేటలో ఐదేళ్ల క్రితమే వైద్య కళాశాల పూర్తి చేశామని, కేసీఆర్‌ హయాంలో కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధేనని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 3 గంటలకు మించి కాంగ్రెస్‌ కరెంట్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి విజయం ఆపలేరన్నారు.

Updated : 2 Oct 2023 2:52 PM IST
Tags:    
Next Story
Share it
Top