ట్రాఫిక్ కష్టాలకు చెక్..స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్
X
భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నగరంలో నూతన బ్రిడ్జ్‌లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఇవాళ మరో బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించిరు. 2.25 కిలోమీటర్ల పొడవున్న, దక్షిణాదిలోనే అతి పెద్దదైన ఈ స్టీల్ బ్రిడ్జ్‌కు కార్మిక నాయకుడు ఎక్స్ మినిస్టర్ మంత్రి నాయిని నరసింహ రెడ్డి గౌరవార్థం ఆయన పేరును పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.." స్టీల్ బ్రిడ్జిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు పునాది వేశాం. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. కాంగ్రెస్ , బీజేపీకి అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయలేదు. ప్రతిపక్షాలు చూపించే సినిమా 2023లోనే ఉంది". అని మంత్రి అన్నారు.
ఈ స్టీల్ బ్రిడ్జ్‌తో వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ మార్గంలో నిత్యం లక్షలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. నిజానికి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఓయూ, నల్లకుంట వెళ్లాలంటే ఎంతలేదన్నా 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో పాటు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీకి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే దాదాపు 25 నిమిషాలు ఆదా కానుంది. దీనిపై వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Good Morning Friends 😍❤️
Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M
— Latha (@LathaReddy704) August 19, 2023