Home > తెలంగాణ > పిట్టగూడు కట్టినట్టు కాదు.. కేటీఆర్ కామెంట్ జగన్‌ను ఉద్దేశించా?

పిట్టగూడు కట్టినట్టు కాదు.. కేటీఆర్ కామెంట్ జగన్‌ను ఉద్దేశించా?

పిట్టగూడు కట్టినట్టు కాదు.. కేటీఆర్ కామెంట్ జగన్‌ను ఉద్దేశించా?
X

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం ఊపందుంటుకోంది. సీఎం కేసీఆర్ నుంచి చోటామోటా నేతల వరకు అందరూ ‘తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది,’ అని భారీ ప్రచారానికి తెరతీశారు. వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు తదితర రంగాల్లో తెలంగాణ ఘన విజయాలు సాధించిందని చెబుతుంటారు. అయితే ఇదంతా డొల్ల ప్రచారంమని గతంలో సాగునీటి ప్రాజెక్టులు, సైబర్ సిటీ, ఓఆర్ఆర్ వంటివి లేవా అని విపక్షాలు ఎదురుదాడి చేస్తుంటాయి.

ఏది ఏమైనా తెలంగాణ అభివృద్ధి అజెండా రాజకీయాల్లో ఒక ట్రెండింగ్ అంశం. పైగా బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ కనుక ప్రచారం కూడా జాతీయ రాజకీయాలకు తగ్గట్టే మారింది. సోమ, మంగళవారాల్లో మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్.. అక్కడ ప్రభుత్వ పనితీరు బాలేదని, బావుంటే తనెందుకు వస్తానని అన్నారు. ఆయనే కాదు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వంటి పెద్ద నేతలు కూడా ఏదో ఒక సందర్భంలో దేశంలో తెలంగాణ మాత్రమే బాగా అభివృద్ధి చెందుతోందని చెబుతుంటారు. ఏపీ, కర్నాటకలపై విమర్శలూ సంధిస్తుంటారు. ఆ రాష్ట్రాల నేతలూ కౌంటర్లు ఇస్తుంటారు. ఈ నేపథ్యలో కేటీఆర్ ఓ తెలంగాణ అభివృద్ధిపై ఓ ఇంటర్వ్యూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో రోడ్లు బాలేవని, కరెంటు లేదని తరచూ విమర్శించే బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు సీఎం జగన్ కడుతున్న సెంటు భూమి ఇల్లు కూడా టార్గెట్ అంశంగా మారినట్లు కేటీఆర్ వ్యాఖ్యలతో అర్థమవుతోంది.

ఏమన్నారు?

మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ కేటీఆర్ పలు పథకాలను ప్రస్తావించారు. డబుల బెడ్రూం ఇళ్ల గురంచి మాట్లాడుతూ ‘పిట్టగూడు’ అని అన్నారు. జగన్ ప్రభుత్వం పేదల కోసం సెంటు భూమిలో నిర్మిస్తున్న ఇళ్లు ‘పిట్టగూళ్ల’లా నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కూడా అదే మాట అనడం ప్రాధాన్యం సంతంరించుకుంది. దేశంలో డబుల బెడ్రూం ఇళ్లు కట్టిన మొగోడు కేసీఆర్ తప్ప మరెవరైనా ఉన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘డబుల్‌ బెడ్రూం పథకం విజయవంతమైంది. ఈ దేశంలో పేదల కోసం కేసీఆర్‌ తప్ప.. డబుల్‌ బెడ్రూం కట్టిన మొగోడు మరొకడుంటే చూపెట్టండి. ఇలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇల్లు కట్టడమంటే అంటే పిట్టగూడు కట్టినట్టు కట్టడం కాదు. రెండు పడక గదులు, ఒక వంటగది, ఒక హాలు ఉండాలి. ఇది కేవలం కేసీఆర్‌కే సాధ్యమైంది. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కడుతున్నాం’’ అని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వం నిర్మించే ఇళ్లను టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది.





Updated : 28 Jun 2023 6:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top