Home > తెలంగాణ > మోదీ, అదానీతో రేవంత్.. కేటీఆర్ ఏమన్నారంటే..?

మోదీ, అదానీతో రేవంత్.. కేటీఆర్ ఏమన్నారంటే..?

మోదీ, అదానీతో రేవంత్.. కేటీఆర్ ఏమన్నారంటే..?
X

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించారు. ఇక బుధవారం అదానీ తనయుడు కరణ్ అదానీ రేవంత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్న సీఎం.. ఈ పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ట్వీట్ చేశారు.

మీటింగ్ విత్ ప్రధాని.. బిజినెస్ విత్ అదానీ అనే క్యాప్షన్తో మోదీ, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలను క్రిషాంక్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రా? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా? అని కామెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు కేటీఆర్, క్రిషాంక్ ట్వీట్లపై మండిపడుతున్నారు. సీఎం స్థాయిలో ఉన్న ప్రధాని సహా వ్యాపారవేత్తలను కలవడం సాధారణమే అని చెప్పారు. బీఆర్ఎస్ అనవసర విమర్శలు చేయడం మానుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.

ktr on cm revanth reddy meets pm modi and karan adani

ktr,brs,cm revanth reddy,pm modi,karan adani,gautam adani,krishank,congress govt,telangana govt,adani group,bjp,rahul gandhi,sonia gandhi,bhatti vikramarka,telangana news,telangana updates

Updated : 4 Jan 2024 2:57 PM IST
Tags:    
Next Story
Share it
Top