Home > తెలంగాణ > కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ చేయొద్దు.. పీవీకి కేటీఆర్ నివాళులు

కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ చేయొద్దు.. పీవీకి కేటీఆర్ నివాళులు

కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ చేయొద్దు.. పీవీకి కేటీఆర్ నివాళులు
X

అప్పుల్లో కూరుకపోయిన దేశాన్ని గాడిన పెట్టిన ఘనత మాజీ ప్రధాని ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధికి పాటుపడిన పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద కేటీఆర్ నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి, దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ అని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వాలు పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పును మోదీ ప్రభుత్వం చేయొద్దని..ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని చెప్పారు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిందే ఇప్పుడూ అడుగుతున్నామన్నారు. పీవీ నర్సింహ రావుకి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని తెలిపారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని కేటీఆర్ అన్నారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై సహా సీఎం రేవంత్ రెడ్డి పీవీకి నివాళులు అర్పించారు. పీవీ పరిపాలనలో మార్పులు తెచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడరు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

Updated : 23 Dec 2023 4:09 PM IST
Tags:    
Next Story
Share it
Top