ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా.. డీజీపీకి ఫోన్
X
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నారని ఆయన సతీమణి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటల భద్రతపై డీజీపీ అంజనీకుమార్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. ముప్పు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు.
కాగా బుధవారం ఈటల జమున సంచలన వ్యాఖ్యల చేశారు. ఈటలను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడని విమర్శించారు. తమ కుటుంబానికి ఏమైన జరిగితే కేసీఆర్దే బాధ్యత అని అన్నారు. . అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తామని చెప్పడం.. ప్రజలపై వారికున్న ప్రేమ ఎటువంటిదో అర్ధమవుతోందన్నారు.