Home > తెలంగాణ > KTR: తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే.. మూడోసారి జయం మనదే.. - మంత్రి కేటీఆర్

KTR: తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే.. మూడోసారి జయం మనదే.. - మంత్రి కేటీఆర్

KTR: తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే.. మూడోసారి జయం మనదే.. - మంత్రి కేటీఆర్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో బీఆర్ఎస్ గెలుపుపై పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌న్నీ ఏక‌ప‌క్ష‌మే అని.. ఈసారి కూడా బీఆర్ఎస్ ఘన విజ‌యం సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో నిండు మ‌న‌సుతో ఆశీర్వదించిన ప్రజలు ముచ్చటగా మూడోసారి కాడు అధికారం కట్టబెడతారని విశ్వాసం వ్య‌క్తం చేశారు. డిసెంబ‌ర్ మూడో తేదీన ముచ్చ‌ట‌గా, మూడోసారి కేసీఆర్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని కేసీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమేనని, భారత రాష్ట్ర సమితిదే భారీ విజయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో ముచ్చటగా మూడోసారి గెలిచేది మనసున్న కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపుతో దక్షిణ భారతదేశంలో స‌రికొత్త రికార్డు సృష్టించ‌బోతున్నాయ‌ని, ద‌క్ష‌త గ‌ల నాయ‌క‌త్వానికే మ‌రోసారి ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హ్యాక్ట‌రీ విక్ట‌రీ ఖ‌రారు.. ప్ర‌తిప‌క్షాలు బేజారు కావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వ‌ర‌కు గుండె గుండెలో గులాబీ జెండా ఎగురుతోంద‌ని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ గడ్డపై గాంధీ సిద్ధాంతం త‌ప్ప‌.. గాడ్సే రాద్ధాంతం న‌డ‌వ‌దు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. 2014లో ఉద్య‌మ చైత‌న్యం, 2018లో సంక్షేమ సంబురంతో గెలిచామని, 2023లో మూడో ఎన్నిక‌ను శాసించేది ముమ్మాటికీ ప‌దేండ్ల స‌మ‌గ్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానమేనని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌రానికి బీఆర్ఎస్ స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉంద‌ని, యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్ర‌స‌న్యాసం తీసుకుంద‌ని, పోటీకి ముందే పూర్తిగా క‌మ‌లం కాడి ప‌డేసింద‌ని కేటీఆర్ విమ‌ర్శ‌ించారు. బీఆర్ఎస్ పార్టీ త‌న పాత రికార్డులు తిరిగి రాయ‌డం ఖాయమని.. ఈ సారి సెంచ‌రీ కొట్ట‌డం త‌థ్యమని కేటీఆర్ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Updated : 9 Oct 2023 6:31 PM IST
Tags:    
Next Story
Share it
Top