Home > తెలంగాణ > వర్షాలపై మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

వర్షాలపై మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

వర్షాలపై మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
X

హైదరాబాద్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానల నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆయన చర్చించారు.

రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అన్ని శాఖల సమన్వయంతో సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. జల మండలి, విద్యుత్, రెవెన్యూ, ట్రాఫిక్ తదితర కీలక విభాగాలు నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వానలను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ ఎంసీ అధికారులు కేటీఆర్ కు చెప్పారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు వరద నీటితో నిండిపోయే ప్రధాన రహదారుల్లో డీవాటరింగ్ పంపులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని అన్నారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పని చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎంతో మెరుగైందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

Updated : 19 July 2023 5:06 PM IST
Tags:    
Next Story
Share it
Top