Home > తెలంగాణ > KTR: వారెంటీ లేని కాంగ్రెస్కు.. గ్యారెంటీలెందుకు

KTR: వారెంటీ లేని కాంగ్రెస్కు.. గ్యారెంటీలెందుకు

KTR: వారెంటీ లేని కాంగ్రెస్కు.. గ్యారెంటీలెందుకు
X

ఖమ్మ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రూ.1390 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొణిజర్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి, మున్నేరు నదికి ఇరు వైపులా రూ.690 కోట్లతో రక్షణ గోడ, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన ప్రగతి నివేదన సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని విమర్శించారు. వారెంట్ లేని కాంగ్రెస్ కు గ్యారెంటీలు ఎందుకని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అడ్రెస్ లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ ప్రజల ముందుకు వస్తుంది. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎంతో ప్రగతి సాధించాం. కాంగ్రెస్ హయాంలో రైతులకు 6 గంటల కరెంట్ ఇవ్వలేదు. తాగు, సాగునీరు, ఎరువులు, విత్తనాల కోసం కొరతతో ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం జిల్లాలో సాగు నీటి సమస్య లేకుండా పోయింది. లక్కారం చెరువును సుందరంగా తీర్చిదిద్దుతాం. రైతును రాజుగా మార్చిన సీఎం కేసీఆర్ ను కాపాడుకుందా’మని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Updated : 30 Sept 2023 2:09 PM IST
Tags:    
Next Story
Share it
Top