Home > తెలంగాణ > బీజేపీలో చేరనున్న సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే కేటీఆర్

బీజేపీలో చేరనున్న సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే కేటీఆర్

బీజేపీలో చేరనున్న సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే కేటీఆర్
X

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇసుక దందాతో పాటు రైస్ మిల్లర్లు, బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రూ.2500 కోట్లను వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బంతా ఢిల్లీకి కప్పం కట్టారని అన్నారు. ఈ విషయం బయటకి రాకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం, బర్ల స్కాం అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కేటీఆర్.. పేగులు మెడలో వేసుకుంటా అని అంటున్న సీఎం మంత్రా.. లేక బోటి కొట్టేవాడివా అని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగేది దొంగలే కదా.. జేబులో కత్తెర జాగ్రత్త కేటీఆర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా బీజేపీపై మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. కావాలనే కవితను అరెస్ట్ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పాట పాడుతున్నారని, లోక్ సభ ఎన్నికలు ముగియగానే సీఎం బీజేపీలో చేరతారని ఆరోపించారు. బీజేపీ అక్రమంగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇతర పార్టీల నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

Updated : 26 March 2024 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top