Home > తెలంగాణ > కవిత చాలా డైనమిక్‌.. మా ఫ్యామిలీలో అంత ధైర్యవంతులెవరూ లేరు: కేటీఆర్‌

కవిత చాలా డైనమిక్‌.. మా ఫ్యామిలీలో అంత ధైర్యవంతులెవరూ లేరు: కేటీఆర్‌

కవిత చాలా డైనమిక్‌.. మా ఫ్యామిలీలో అంత ధైర్యవంతులెవరూ లేరు: కేటీఆర్‌
X

హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో విమెన్ ఆస్క్ కేటీఆర్ ( #WomenAskKTR) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తండ్రి కేసీఆర్ ప్రజా జీవితంలో ఉండటం వల్ల చిన్నతనంలో ఆయన ప్రభావం తమపై తక్కువగా ఉండేదని అన్నారు. తమ తల్లిని చూసి చాలా నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తమ కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన భార్య చాలా ఓపిగ్గా ఉంటారని, తన చెల్లి కవిత చాలా డైనమిక్ అని.. తమ కుటుంబంతో అంత ధైర్యవంతులు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తనకున్న ఇద్దు పిల్లల్ని సమానంగా చూస్తానని, కూతురు పుట్టాక జీవితం మారిపోయిందని అన్నారు కేటీఆర్.

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే.. తక్కువ వడ్డీతో మహిళలకు రుణాలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో మహిళలకే కాకుండా.. రాజకీయ నాయకులకు కూడా చాలా ప్రమాదం ఉందని వివరించారు. కొంతమంది తమ ముఖాలతో డీప్ ఫేక్ వీడియోలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని, రాబోయే రోజుల్లో ఆ సంఖ్య పెరిగేలా చూస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి అంతా కళ్లముందే కనిపిస్తుంది. ప్రజలు కేసీఆర్ కు అండగా ఉన్నారు. ప్రజల సంక్షేమానికే మేనిఫెస్టోను తీసుకొచ్చాం. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎసే గెలుస్తుంది. 100 స్థానాల్లో జెండా పాతుతుంది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్నిరంగాల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Updated : 19 Nov 2023 1:24 PM IST
Tags:    
Next Story
Share it
Top