Home > తెలంగాణ > కేసీఆర్ దండు ఢిల్లీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది : KTR

కేసీఆర్ దండు ఢిల్లీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది : KTR

కేసీఆర్ దండు ఢిల్లీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది : KTR
X

అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై జరిగిన దుష్ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయామని కేటీఆర్ అన్నారు. దేశంలో దివాళ తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అధికారం దక్కిందని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హమీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. చిన్న చిన్న లోపాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. బీఆర్ఎస్ లేకుంటే పార్లమెంట్లో తెలంగాణ ఉనికి లేకుండా పోతుందని తెలిపారు.

తెలంగాణ పరపతిని తగ్గించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ ఒక్కటేనని.. కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారారని చెప్పారు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ - బండి సంజయ్ మధ్య అవగాహన కుదిరినట్లుందని ఆరోపించారు. రైతుబంధుపై ఇప్పటివరకు అతీగతీ లేదని.. రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్నారు.

Updated : 3 Jan 2024 9:06 PM IST
Tags:    
Next Story
Share it
Top