Home > తెలంగాణ > సూర్యాపేటలో ఐటీ హబ్.. వచ్చే నెలలో ప్రారంభించనున్న కేటీఆర్

సూర్యాపేటలో ఐటీ హబ్.. వచ్చే నెలలో ప్రారంభించనున్న కేటీఆర్

సూర్యాపేటలో ఐటీ హబ్.. వచ్చే నెలలో ప్రారంభించనున్న కేటీఆర్
X

ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తోంది. టైర్ 2 సిటీలకు సైతం ఐటీ సర్వీసులు విస్తరించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ సర్కారు సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 8 కంపెనీలతో కలిసి పాత కలెక్టరేట్ బిల్డింగ్ లో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.

సూర్యాపేట ఐటీ హబ్ను అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మంత్రి జగదీష్ రెడ్డి టాస్క్ అధికారులతో కలిసి బ్రోచర్ రిలీజ్ చేశారు.. ఐటీ హబ్లో ఫస్ట్ ఫేజ్లో 180 మందికి ఉపాధి లభించనుంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సూర్యాపేటలో ఐటీ జాబ్‌ మేళా నిర్వహించనున్నారు.

అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్‌ సూర్యాపేటతో పాటు నల్లగొండ జిల్లాలోనూ పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌ను సైతం మంత్రి అదే రోజు ప్రారంభిస్తారు. దీంతో పాటు నల్లగొండలో రూ.234 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కళా భారతి, పానగల్‌ ఉదయ సముద్రం చెరువు, వల్లభరావు చెరువులను ట్యాంకుబండ్‌లుగా తీర్చిదిద్దే పనులకు శంకుస్థాపన చేస్తారు.

Updated : 22 Sept 2023 8:23 PM IST
Tags:    
Next Story
Share it
Top