Home > తెలంగాణ > KTR Tweet: తెలంగాణ ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీ వైపు.. 77 సీట్లు పక్కా

KTR Tweet: తెలంగాణ ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీ వైపు.. 77 సీట్లు పక్కా

KTR Tweet: తెలంగాణ ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీ వైపు.. 77 సీట్లు పక్కా
X

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హాట్రిక్ విజయం సాధించి మరోసారి అధికారం చేపడుతుందపి మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని.. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మరోపారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే సాక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని అన్నారు. కాగా తాజాగా రాజనీతి సంస్థ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వచ్చింది. బీఆర్ఎస్ కు 112 సీట్లకు గాను.. 77 సీట్లు వస్తాయని తేలింది. అదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

కాగా రాజనీతి సంస్థ.. మునుగోడు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 6 అసెంబ్లీ సీట్లు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. అందులో బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఓటింగ్స్ వచ్చాయి. 112 సీట్లకు గానూ బీఆర్ఎస్ 77 సీట్లు గెలుస్తుందని వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 29, బీజేపీకి 6, బీఎస్సీ-0 సీట్లు వస్తాయని రాజనీతి సర్వే అంచనా వేసింది. ఆ విషయం చెప్పుకొచ్చిన కేటీఆర్.. ‘‘బీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ దరిదాపుల్లో లేని కాంగ్రెస్, బీజేపీ. రాజనీతి సంస్థ వారు నిర్వహించిన సర్వేలో 112 సీట్లకు గాను 77 సీట్లలో విజయఢంకా మోగించనున్న బీఆర్ఎస్ పార్టీ’’ అని ట్వీట్ చేశారు.

Updated : 30 Oct 2023 10:59 AM IST
Tags:    
Next Story
Share it
Top