Home > తెలంగాణ > 3 పంటలా..? 3 గంటలా..? రైతులు తేల్చుకోవాలి.. మంత్రి కేటీఆర్

3 పంటలా..? 3 గంటలా..? రైతులు తేల్చుకోవాలి.. మంత్రి కేటీఆర్

3 పంటలా..? 3 గంటలా..? రైతులు తేల్చుకోవాలి.. మంత్రి కేటీఆర్
X

తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే అంశానికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ‘‘కేసీఆర్‌ నినాదం.. మూడు పంటలు. కాంగ్రెస్‌ విధానం.. మూడు గంటలు. భాజపా విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అనేది రైతులు తేల్చుకోవాలి. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

"కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. ! నోట్లు తప్ప... రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం.. అన్నదాత నిండా మునుగుడు పక్కా అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నడు రాబందు, నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు

నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు అని మండిపడ్డారు. మూడు ఎకరాల రైతుకు.. మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే. కాంగ్రెస్‌కు ఎప్పుడూ.. చిన్నకారు రైతు అంటే చిన్నచూపు, సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అని ధ్వజం ఎత్తారు. నాడు.. ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్, నేడు.. ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని, మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి" అన్నారు.

అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం...అని, మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం అన్నారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని, రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? ఆలోచన చేయాలన్నారు.

Updated : 12 July 2023 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top