KTR : గణతంత్ర దినోత్సవం వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ట్వీట్
X
బీఆర్ఎస్ వర్నింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం సంచలన ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్దెన రాసిన సుమతి శతకంలోని పద్యం ‘కనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. దానికి క్యాప్షన్ గా.. పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారని షేర్ చేశారు. దీంతో కేటీఆర్ ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ ట్వీట్ చేశారోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. కాగా నెటిజన్స్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ గా ఆ ట్వీట్ చేశారని అంటున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ.. గురువారం బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని, ప్రజల సొమ్మును దోచుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో పాతేస్తామని విమర్శించారు. రేవంత్ కామెంట్స్ కు కేటీఆర్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు చెప్తున్నారు.
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt
— KTR (@KTRBRS) January 26, 2024