పార్టీ మారమని మైనంపల్లి మా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తుండు - కేటీఆర్
X
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. మేడిపండులా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. శనివారం (ఫిబ్రవరి 10) సికింద్రాబాద్ SVITలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోవాలని.. లేనిపక్షంలో బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ ను వదిలిపెట్టరని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు లక్షా 25 వేల కోట్లు అవసరమైతే.. బడ్జెట్ లో మాత్రం రూ.53 వేల కోట్లు కేటాయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ బుడ్డర్ ఖాన్ లా మాట్లాడుతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తాననడం విచిత్రంగా ఉందని విమర్శించారు. ప్రతి మీటరుకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్.. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి.. కాంగ్రెస్ పార్టీలోకీ రావాలని ఒత్తిడి తెస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈనెల 19వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు అండగా ఉంటానని.. ఎవరూ అధైర్యపడొద్దని కార్పొరేటర్లకు కేటీఆర్ భరోసానిచ్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.