Home > తెలంగాణ > KTR : కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్.. మేడిగడ్డకు కేటీఆర్

KTR : కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్.. మేడిగడ్డకు కేటీఆర్

KTR : కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్.. మేడిగడ్డకు కేటీఆర్
X

తెలంగాణ రాజకీయం కాళేశ్వరం చుట్టూ తిరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార-ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరంపై కత్తులు నూరుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మేడిగడ్డను సందర్శించగా.. ఇప్పుడు బీఆర్ఎస్ రెడీ అయ్యింది. ప్రభుత్వానికి పోటీగా కాళేశ్వరం సందర్శనకు వెళ్లనుంది.

తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నడుస్తున్నాయి. ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైంది. పిల్లర్లు కుంగడంతో బ్యారేజీ అంశం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక నజర్ పెట్టింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలిపింది. అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జిని కేటాయించకపోవడంతో దానికి బ్రేక్ పడింది. ఇక మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్స్ఫోర్స్మెంట్ విచారణ చేస్తోంది.

ఇటీవలే రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు వెళ్లింది. ఈ సందర్శనకు అన్నీ పార్టీలను ఆహ్వానించినా బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన తీరు, డ్యాం సేఫ్టీని సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. కేసీఆర్ తీరు వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని అప్పుడు సీఎం రేవంత్ ఆరోపించారు. ఇంజినీర్లు ప్రాజెక్టు వద్దని చెప్పినా వినకుండా కేసీఆర్ మొండిగా వ్యవహరించారన్నారు. చేవేళ్ల ప్రాణహిత డిజైన్ మార్చడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీఆర్ఎస్ కాళేశ్వరం బాట పట్టనుంది. మార్చి 1న ఛలో మేడిగడ్డ చేపడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 150-200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో మేడిగడ్డను సందర్శిస్తామని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే వాస్తవాలు చెప్పేందుకు అక్కడకి వెళ్తామని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలపై అనుమానాలు కలుగుతున్నాయని.. మూడు ప్రాజెక్టులు కొట్టుకపోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు.

మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మేడిగడ్డ అంశంతో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే.. అదే ప్రాజెక్టు అంశంతో తిప్పికొట్టాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసమే ప్రాజెక్టు సందర్శన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఈ ఎన్నికల్లో కాళేశ్వరం అంశం ఏ పార్టీకి కలిసొస్తుందనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ..

Updated : 27 Feb 2024 2:52 PM IST
Tags:    
Next Story
Share it
Top