Home > తెలంగాణ > KTR: కాంగ్రెస్పై గురి.. పొన్నాల లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్.. దానిపై ఒప్పిస్తారా?

KTR: కాంగ్రెస్పై గురి.. పొన్నాల లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్.. దానిపై ఒప్పిస్తారా?

KTR: కాంగ్రెస్పై గురి.. పొన్నాల లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్.. దానిపై ఒప్పిస్తారా?
X

జనగాం టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనను.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తన విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదంటూ పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. కాగా పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరతారని రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ శనివారం మధ్యాహ్నం పొన్నాల నివాసానికి వెళ్లారు. ఆయనతో కలిసి చర్చలు జరిపారు. పొన్నాల ఆహ్వానం మేరకే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పొన్నాల.. బీఆర్ఎస్ నుంచి జనగాం టికెట్ ఆశించే అవకాశం ఉంది.

అయితే బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో జనగాం టికెట్ ఇప్పటికే ఖరారు చేసింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కడంతో.. ఆయన పోటీకి సిద్ధం అయ్యారు. దీంతో ఇప్పుడు ఆ సీటు పొన్నాలకు ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే.. ఆయనకు కొన్ని ఆఫర్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జనగాం ఎమ్మెల్సీ టికెట్ గానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కీలక పదవిగానీ ఇచ్చే ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఉంది. పొన్నాలకు ఆసక్తి ఉంటే రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధం అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ ఒప్పందం ఓకే అయితే.. పొన్నాల బీఆర్ఎస్ లో చేరడం ఖాయం అవుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికి పొన్నాల మంచి ఆప్షన్ అవ్వొచ్చు. కాంగ్రెస్ ను నమ్ముకున్న బీసీలను ఆ పార్టీ మోసం చేస్తుందని ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి వెళ్లొచ్చు.

Updated : 14 Oct 2023 3:13 PM IST
Tags:    
Next Story
Share it
Top