Home > తెలంగాణ > KTR : కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. రంగంలోకి దిగిన కేటీఆర్

KTR : కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. రంగంలోకి దిగిన కేటీఆర్

KTR  : కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. రంగంలోకి దిగిన కేటీఆర్
X

పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. బీఆర్ఎస్ నేతలను హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరగా.. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే లిస్టులో మరికొంత మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మైనపంల్లి హన్మంతరావు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.





జీహెచ్ఎంసీ ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను కాంగ్రెస్ మైనంపల్లికి అప్పగించింది. దీంతో కాంగ్రెస్లో చేరాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మైనంపల్లి ఫోన్లు చేస్తున్నారు. మైనంపల్లి ఫోన్ల నేపథ్యంలో కార్పొరేటర్లు చేజారకుండా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ అపరేషన్ ఆకర్ష్ను అడ్డుకునేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. కాసేపట్లో కార్పొరేటర్లతో ఆయన సమావేశమవుతున్నారు. కాగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇప్పటికే హస్తం కండువా కప్పుకున్నారు. మరికొంత మంది అదే రూట్లో ఉన్నట్లు తెలుస్తోంది.


Updated : 10 Feb 2024 10:49 AM IST
Tags:    
Next Story
Share it
Top