Home > తెలంగాణ > మంత్రి కేటీఆర్​కు వెరైటీగా బర్త్ డే విషెస్

మంత్రి కేటీఆర్​కు వెరైటీగా బర్త్ డే విషెస్

హ్యాపీ బర్త్ డే కేటీఆర్

మంత్రి కేటీఆర్​కు వెరైటీగా బర్త్ డే విషెస్
X



బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌ నేడు హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డు (పీవీ మార్గ్‌)లోని థ్రిల్‌ సిటీ థీమ్‌ పార్క్‌లో కేటీఆర్ బర్త్ డే ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా త్రీడీ స్క్రీన్‌పై వినూత్నంగా కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేయనున్నారు. ప్రపంచ రికార్డ్‌ సాధించిన కుట్టి చే రూబిక్స్‌ క్యూబ్‌ ఆర్టిస్ట్‌తో కేటీఆర్‌ భారీ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సంతోష్ అనే యువకుడు వినూత్నంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని రాసి ఉన్న ఫ్లెక్సీ ని పట్టుకొని పారాషూట్ తో ఆకాశంలో విహరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి పోస్టు చేశారు. దీనికి రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్. ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CvCrvDahanI/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి జడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలోని పొలంలో "హ్యాపీ బర్త్ డే కేటీఆర్" అంటూ వరి నారుతో విషెస్ తెలిపారు. సుమారు 5 ఎకరాల పొలంలో వరి నారుతో మంత్రి కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


Updated : 24 July 2023 11:28 AM IST
Tags:    
Next Story
Share it
Top