Home > తెలంగాణ > అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగ లేఖ రాశారు. ఛార్జీలు లేకుండానే ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని లేఖలో తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని అన్నారని, ఇప్పుడు దానికి సంబంధించి ఛార్జీలను వసూలు చేయకూడదన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లో ఎటువంటి ఛార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలను విడుదల చేయాలని కేటీఆర్ కోరారు. లేకుంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్దాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఉచిత ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలని కేటీఆర్ లేఖతో తెలిపారు. రాష్ట్రంలో పాతిక లక్షలకుపైగా కుటుంబాలపై కనీసం లక్ష రూపాయల భారం వేస్తున్నారని, ప్రజల నుంచి రూ.20 వేల కోట్లను గుంజుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దయలేనిదని ఫైర్ అయ్యారు.

గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకుంటూనే మరోవైపు లబ్ధిదారుల ఎంపికలో అనేక షరతులు, నిబంధనలు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ విషయంలోనూ ప్రభుత్వ ద్వంద వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుంటే చూస్తూ ఊరుకోమని, అసెంబ్లీలో చెప్పిన మాటలు ఆవగింజంత వాస్తవమైతే వెంటనే ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.


Updated : 9 March 2024 2:29 PM GMT
Tags:    
Next Story
Share it
Top