Home > తెలంగాణ > KTR : సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..ఓడితే మగాడు కాదా?

KTR : సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..ఓడితే మగాడు కాదా?

KTR  : సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..ఓడితే మగాడు కాదా?
X

ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేయాలని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ,రేవంత్ రెడ్డి తన సవాల్ ఎందుకు స్వీకరించడంలేదని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. మనిద్దరిలో మగాడు ఎవరో తేలిపోతుంది అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిస్తేనే మగాడా.. ఓడిపోతే మగాడు కదా?... అలాగైతే రేవంత్ రెడ్డి నా సవాల్ ను స్వీకరించాలని అన్నారు. రేవంత్ రెడ్డి లాగా తాను రాంగ్ రూట్లో రాలేద‌ని, బ‌రాబ‌ర్ తెలంగాణ ఉద్య‌మం నుంచి వ‌చ్చిన బిడ్డ‌ను అని కేటీఆర్ తేల్చిచెప్పారు. మా ఫాదర్ పేరు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాడ్ని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.

రేవంత్‌రెడ్డిలా రాంగ్ రూట్‌లో రాలేదు. ఆంధ్రుల బూట్లు నాకి, పార్టీ మారి ముఖ్యమంత్రి అయింది రేవంత్ అని సీఎం పదవిలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి..రేవంత్ ఇకనైనా చిల్లర మాటలు కట్టిపెట్టాలి" అని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కల్యాణలక్ష్మి పధకంలో తులం బంగారం ఇస్తామని రేవంత్ ఎన్నికల వేళ చెప్పాడని, ఇంతవరకు తులం బంగారం ఇవ్వనేలేదని, ఇంకా కేసీఆర్ అమలు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులే ఇస్తున్నారని కేటీఆర్ వివరించారు. బంగారం లేదు.. మన్ను లేదు.. మార్చి 17తో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల సినిమా పూర్తవుతుంది.. 100 రోజులు పూర్తయ్యాక ఈ కాంగ్రెస్ పార్టీకి ఆడబిడ్డలే బొంద తవ్వుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మొన్న‌టి ఎన్నిక‌ల్లో కామారెడ్డి ఫ‌లితం చేదు జ్ఞాప‌కాన్ని మిగిల్చింది. దాన్ని గురించి చ‌ర్చ‌, రాద్ధాంతం వ‌ద్దు. గ‌తం గ‌తః భ‌విష్య‌త్‌పై ముందు చూపు ఉండాలి. కామారెడ్డి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అంద‌రికీ అందుబాటులో ఉన్న గంప గోవ‌ర్ధ‌న్ మీకు అండ‌గా ఉన్నారు. రేప‌టి రోజున గంప గోవ‌ర్ధ‌న్ నాయ‌క‌త్వంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందుకు పోతామ‌ని కేటీఆర్ తెలిపారు.




Updated : 10 March 2024 12:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top