నాకు సమాచారం ఉంది.. త్వరలోనే షర్మిల మా పార్టీలోకి వస్తుంది: కేవీపీ
X
వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతుందా లేదా అనే విషయంలో తనకు క్లారిటీ ఉందని సమాధానం ఇచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని.. ఓ కాంగ్రెస్ వాదిగా ఆయన ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని కాంగ్రెస్ పరిస్థితులను రాహుల్ కు వివరించామని, గత ఎలక్షన్స్ లో టీడీపీతో పెట్టుకోవడం వల్ల నష్టపోయామని.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. జగన్, టీడీపీలు కలిసి విభజన హామీలు నెరవేరకుండా ఆపారని మండిపడ్డారు. మోదీ అన్యాయాలను ప్రజలకు వివరించే పనిలో కాంగ్రెస్ ఉందని తెలిపారు.