Home > తెలంగాణ > మేడిగడ్డ బ్యారేజీ.. ఎల్ అండ్ టీ కంపెనీ ఏమన్నదంటే..?

మేడిగడ్డ బ్యారేజీ.. ఎల్ అండ్ టీ కంపెనీ ఏమన్నదంటే..?

మేడిగడ్డ బ్యారేజీ.. ఎల్ అండ్ టీ కంపెనీ ఏమన్నదంటే..?
X

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడే మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించామని చెప్పింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న కొంత భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ప్రాజెక్టు నిర్మించి 2019లో అప్పగించినట్టు తెలిపింది. గత 5ఏళ్లుగా వరదను తట్టుకుని ప్రాజెక్టు నిలబడిందని వివరించింది. మేడిగడ్డ అంశం ప్రస్తుతం అధికారుల పరిశీలన, చర్చల్లో ఉందని చెప్పింది. తదుపరి కార్యాచరణపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. ఆ తర్వాత పునరుద్ధరణ పనులు చేపడతామని స్పష్టం చేసింది.


Updated : 4 Nov 2023 9:48 PM IST
Tags:    
Next Story
Share it
Top