Gyanvapi Masjid: పురావస్తుశాఖ తాజా సర్వే.. జ్ఞానవాపి మసీదు కింద అతిపెద్ద ఆలయం
X
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ASI) మరో సంచలన విషయం బయటపెట్టింది. ఉత్తర్ ప్రదేశ్, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి. జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నాయని తాజాగా ప్రకటించిన సర్వే రిపోర్టులో తేల్చింది. ఈ విషయాన్ని హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. ఆలయంపై మసీదు నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఆ మసీదు ప్రాంగణంలో తెలుగు భాషతో పాటు కన్నడ, దేవనాగరి సహా మొత్తం 34 భాషల్లో ఉన్న కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయని ఆయన చెప్పారు.
జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే ముగ్గురు దేవుళ్ల ప్రస్తావన ఆ శాసనాళ్లో ఉన్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు వారు నిర్ధారించారు. ఆలయానికి సంబంధించిన స్తంభాలతోనే మసీదు నిర్మించినట్లు సర్వేలో తేలిపారు. గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్.. పలు విషయాలు పంచుకున్నారు. పురావస్తు శాఖ 839 పేజీల సర్వే రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్లు స్పష్టంగా ఉందని చెప్పారు. సర్వే రిపోర్ట్ లో ఆలయానికి సంబంధించిన తగినన్ని సాక్ష్యాధారాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.