Home > తెలంగాణ > కేసీఆర్.. మాకూ కొన్ని సీట్లివ్వండి.. కోరనున్న లెఫ్ట్

కేసీఆర్.. మాకూ కొన్ని సీట్లివ్వండి.. కోరనున్న లెఫ్ట్

కేసీఆర్.. మాకూ కొన్ని సీట్లివ్వండి.. కోరనున్న లెఫ్ట్
X

అసెంబ్లీ ఎన్నికల కోసం కేటాయింపు కోసం బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సీట్ల కోసం సీఎం కేసీఆర్ తో చర్చలు జరపాలని చూస్తున్నారు వామపక్షాల నేతలు. దీనికోసం మూడు రోజుల క్రితం ముగ్దూం భవన్ లో సీపీఐ, సీపీఎం కార్యదర్శులు, ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీట్ల కోసం బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరపాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ చర్చల కోసం సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. దాంతో ఒకటి రెండు రోజుల్లో అపాయింట్మెంట్ ఖరారు చేస్తామని సీఎం కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఈ అపాయింట్మెంట్ కన్ఫార్మ్ అయితే.. వామపక్ష నేతలంతా సీఎంతో సమావేశం అవుతారు.

ఈ సమావేశంలో వామపక్షాల నుంచి ముఖ్య నేతలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భేటీ సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. తమ పార్టీకి ఎన్ని సీట్లు కట్టబెడతారో తెలుసుకునేందుకు ఈ చర్చలు జరుగనున్నాయి. ఎలక్షన్స్ కు మరో ఆరు నెలల గడువు ఉన్న నేపథ్యంలో వామపక్షాలు.. సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. సీట్ల కేటాయింపులో కేసీఆర్ ఆలస్యం చేస్తే తమ పార్టీ భారీగా నష్టపోతుందని వామపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల టైంలో బీఆర్ఎస్ కు వామపక్షాల మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎలక్షన్స్ అప్పుడే కేసీఆర్ వామపక్షాలకు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Updated : 24 Jun 2023 10:48 PM IST
Tags:    
Next Story
Share it
Top